వికాస్ ముప్పాల, గాయత్రి గుప్తా, సాజ్వి పసల, సంతోష్ నందివాడ, కిషోర్ ప్రధాన పాత్రల్లో బి.బి.టి.ఫిల్మ్స్ బ్యానర్‌పై భాను భవ తారక దర్శకత్వంలో కార్తీక్ సేపురు, భాను భవ తారక, తరుణ్ విఘ్నేశ్వర్ సేరుపు నిర్మిస్తోన్న చిత్రం ‘ప్లాట్’. గురువారం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దర్శకుడు వేణు ఊడుగుల ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… డైరెక్టర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘ప్లాట్ టీం ఏడాది క్రితం నా వద్దకు వచ్చింది. పోస్టర్‌ను రిలీజ్ చేశాను. ఆ పోస్టర్ నాకు చాలా నచ్చింది. ఎంతో కొత్తగా, వైవిధ్యంగా ప్రయత్నించారు. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. కారెక్టర్స్, క్యాస్టూమ్స్, మాటలు, శబ్దాలు ఎంతో సహజంగా అనిపించాయి. ట్రైలర్ చూస్తే కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లినట్టుగా అనిపిస్తోంది. భాను గురించి భవిష్యత్తులో అందరూ…