అగ్ర కథానాయిక నయనతార జీవితంపై డాక్యుమెంటరీ ఫిల్మ్ సిద్ధమైంది. ఆమె వృత్తి, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ దీనిని రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ప్రోమో సినీప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన పలు విశేషాలను ఓటీటీ సంస్థ ప్రకటించింది. ’నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నవంబర్ 18 నుంచి ఇది స్ట్రీమింగ్ కానుంది. అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టారు నయనతార. కాలేజీ రోజుల్లో ఆమె పార్ట్‌టైమ్ మోడల్‌గా వర్క్ చేశారు. ఓ సందర్భంలో ఆమెను చూసిన దర్శకుడు సత్యన్ అంతికాడ్.. ’మనస్సిక్కరే’లో నటిగా అవకాశం ఇచ్చారు. తొలుత దానిని తిరస్కరించిన ఆమె చివరకు ఓకే చెప్పారు. 2003లో పరిశ్రమలోకి వచ్చిన నయన్.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. స్టార్ హీరోయిన్‌గా…