ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి యేటా వివిధ రంగాల్లో విశిష్ఠ సేవలు అందించిన వారిని గుర్తించి గౌరవించే జాతీయ పురస్కారం తులసి సమ్మాన్ కు తెలుగు రాష్ట్రాల నుంచి రాఘవ రాజ్ భట్ ను ఎంపిక చేయడం విశేషం. తులసి సమ్మాన్ జాతీయ పురస్కారంతో రాఘవ రాజ్ భట్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ సి. పటేల్ ఘనంగా సత్కరించారు. భారత్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా జానపద కళలకు ఆయన అందిస్తున్న సేవలకు ఈ పురస్కారం లభించింది. తెలుగు జానపద కళాబ్రహ్మ డా. గోపాల్ రాజ్ భట్ వారసుడు రాఘవ రాజ్ భట్. భారతీయ జానపద కళలను పరిరక్షిస్తూ పరివ్యాప్తి చేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు.…