గతం నుండి ఎప్పటికీ మర్డర్ మిస్టరీ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే వున్నారు. గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో సినిమాను తెరమీద ఆవిష్కరించగలిగితే ఇలాంటి మర్డర్ మిస్టరీ డ్రామాను చూడటానికి ఆడియన్స్ క్యూలు కడతారు. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూవుంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరమీదకు ఎక్కించారు. నిర్మాత కిరణ్ కుమార్ దీనిని నిర్మించారు. ఇందులో రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్ పై తెరకెక్కిన ఈ చిత్రం.. ఈ రోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి. కథ:…