మెగాస్టార్ చిరంజీవి గత సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో తన అభిమానులకు, ప్రేక్షకులకు ఫుల్ మీల్ ఫీస్ట్ అందించారు. మెగాస్టార్‌కు ఈ సంవత్సరం పండుగకు థియేట్రికల్ రిలీజ్ లేనప్పటికీ మెగాస్టార్ మాగ్నమ్ ఓపస్ #Mega156 మేకర్స్ సినిమా టైటిల్‌ను స్పెల్‌బైండింగ్ గ్లింప్స్ ను లాంచ్ చేయడం ద్వారా పర్ఫెక్ట్ సంక్రాంతి ప్రజంటేషన్ అందించారు. గ్లింప్స్ మనల్ని అద్భుత ప్రపంచంలోకి తీసుకెళుతుంది. అక్కడ ఎవరో మ్యాజికల్ బాక్స్ ని లాక్ చేస్తారు, అది అనుకోకుండా పడిపోయింది. ఇది బ్లాక్ హోల్ గుండా వెళుతుంది. ఒక గ్రహశకలం లోకి క్రాష్ అవుతుంది. అటువంటి అనేక ఆటంకాలు అడ్డంకులు తర్వాత, ఆ మ్యాజికల్ బాక్స్ చివరకు భూమికి చేరుకుంటుంది. ఇది ఒక పెద్ద హనుమాన్ విగ్రహంతో సింబాలిక్ గా చూపించారు. ఒక బిలం భూమిపైకి దూసుకువస్తుంది. అయినప్పటికీ మ్యాజిక్ బాక్స్‌కు ఏమీ జరగదు.…