మన జీవితంలోని మొదటి ప్రేమ మ్యాజిక్, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికి మరచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తూ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్ “గుర్తుందా శీతాకాలం”. చినబాబు, ఎంఎస్ రెడ్డి సమర్పణలో శ్రీ వేదాక్షర ఫిలింస్, నాగశేఖర్ మూవీస్, మణికంఠ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై యంగ్ & టాలెంటెడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, పాన్ ఇండియా యాక్టరస్ తమన్నా భాటియా, మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని నటిస్తున్నారు. కన్నడలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా. నర్మిస్తున్నారు.కాల భైరవ అందించిన సంగీతం మనసును మైమరిచిపోయేలా చేస్తుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్బంగా మాటల రచయిత లక్ష్మీ భూపాల్…