సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కుమార్తె గాయత్రి గత శనివారం మృతి చెందింది. అయితే రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించడంతో పాటు రాజేందప్రసాద్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పాటు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, వెంకటేశ్ తదితరులు ఆయనను పరామర్శించి ధైర్యం చెప్పారు. అయితే కూతురు పోయిన బాధలో ఉన్న నటకిరిటిని తాజాగా నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పరామర్శించాడు. ఆయనకు ధైర్యం చెప్పారు. అనంతరం రాజేందప్రసాద్ కూతురు గాయత్రికి నివాళులు అర్పించాడు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె 38 ఏండ్ల గాయత్రికి గత రాత్రి గుండెపోటు రాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చేర్చారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె చనిపోయారు. కాగా, రాజేంద్ర ప్రసాద్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అలానే గాయత్రి కుమార్తె సాయి తేజస్విని బాలనటిగా మహానటి చిత్రంలో నటించారు.
Related posts
-
gang star movie review in telugu : ‘గ్యాంగ్ స్టర్’ మూవీ రివ్యూ : యాక్షన్ తో సాగే ఎమోషనల్ కథ!
Spread the love (చిత్రం : ‘గ్యాంగ్ స్టర్’ , రేటింగ్ : 3/5, నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్,... -
‘లగ్గం’ మూవీ రివ్యూ : రొటీన్ ఫ్యామిలీ ఎమోషన్స్ !
Spread the love పూర్తి ఎమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చిన సినిమా ‘లగ్గం’. పక్కా తెలంగాణ యాసలో తెరకెక్కిన ఈ సినిమా... -
‘Laggam’ Movie Review: Routine Family Emotions!
Spread the love The movie ‘Laggam’ has come to impress the audience with full emotional content. As...