ఇప్పటికే ఎంతోమంది ధీరుల బయోపిక్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్న క్రమంలో తాజాగా మరాఠి రాణి అహల్యా బాయి హోల్కర్ జీవితం తెరకెక్కనుంది. ఆమె జీవితగాధ ఆధారంగా సినిమా తీయనున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రాణి అహల్యా బాయి హోల్కర్ 300వ జయంతిని పురస్కరించుకొని మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతటా కొన్ని ప్రాజెక్ట్‌లకు శ్రీకారం చుట్టింది. అలానే ఆమె జీవితం ఎంతోమందికి స్ఫూర్తి అని అందుకే సినిమాగా ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నట్లు సీఎం తెలిపారు. దీనిపై ఇప్పటికే చర్చలు ప్రారంభమైనట్లు వెల్లడించారు. మరాఠీతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చెప్పారు. దూరదర్శన్, ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ రాణి అహల్యా బాయి హోల్కర్ బయోపిక్ అందుబాటులో ఉండేలా చూస్తామని అన్నారు. ఇటీవలే మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ వీరగాథ ‘ఛావా’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని…