సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన, ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ ‘మజాకా’ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ రిలీజ్- ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదల పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ , జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్లో రీతు వర్మ హీరోయిన్ . ఈరోజు, మజాకా హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. సందీప్ కిషన్, రీతు వర్మ ఆర్కె బీచ్‌లో డ్రింక్ చేస్తూ పట్టుబడటంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది వారి అరెస్టుకు దారితీస్తుంది. వారి మధ్య…