-‘ది అల్టిమేట్ బ్యాటిల్ బిట్వీన్ గుడ్ & ఈవిల్’- తమన్నా భాటియా, అశోక్ తేజ, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బిగ్ బడ్జెట్ మల్టీలింగ్వెల్ ఫిల్మ్ ‘ఓదెల 2’ థ్రిల్లింగ్ టీజర్ మహా కుంభమేళాలో లాంచ్ తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో బోల్డ్ న్యూ క్యారెక్టర్ పోషిస్తున్నారు. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రతి అప్‌డేట్‌తో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తుంది. ఈరోజు, ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో చిత్ర యూనిట్ బోట్ లో ప్రయాణించి త్రివేణి సంగమం వద్ద నాగసాధువుల సమక్షంలో టీజర్‌ను గ్రాండ్ గా లాంచ్ చేశారు.…