హైదరాబాద్: మాంసాహారులకు యాంటీబయాటిక్స్ లేకుండా సురక్షితమైన ,రుచికరమైన మరియు పోషకాలతో కూడిన చికెన్ అందించటానికి మధూస్ హెర్బల్ చికెన్ వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఐసిఎఆర్-నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ యస్.బి.బర్బుద్దే అన్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ లోని ఐసిఎఆర్ నేషనల్ మీట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో మధూస్ హెర్బల్ చికెన్ ప్రారంభం సందర్బంగా జరిగిన సాంకేతిక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ఆకలి సూచికలో 125 దేశాలలో భారతదేశం 111 వ స్థానంలో ఉండటం భారత జనాభా యొక్క పోషక అవసరాలను పెంచాల్సిన అవసరాన్ని సూచిస్తుందని అన్నారు.మాంసంతో సహా జంతు ఆధారిత ఆహారాలు ప్రోటీన్, విటమిన్ మరియు ఖనిజ అవసరాలను తీర్చడంలో సహాయపడతాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.మాంసం ఉత్పత్తి,ప్రోససింగ్ మరియు వినియోగ సాంకేతికత ల…