టిఎమ్మెస్, ప్రీతమ్ ఆర్ట్స్ అండ్ ఎస్‌ఎన్ క్రియేషన్స్ బేనర్స్ పై శ్రీ నారాయణ దర్శకత్వంలో విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న చిత్రం ‘@లవ్’. ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవుతోంది. రామరాజు, సోనాక్షి వర్మ, అభి, ప్రీతి సుందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేందర్ సింగ్, శైలజ తాటిచెర్ల మరియు శ్రీనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు .తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు యూఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు అప్రిషియేట్ చేశారు. చక్కని ఏమోషనల్ థ్రిల్లింగ్ లవ్ స్టొరీ గా రూపొందిన ఈ సినిమా సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకుంది. గిరిజన నేపథ్యంలో స్వచ్ఛమైన ప్రేమ కథతో రాబోతున్న ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సందర్బంగా దర్శకుడు శ్రీ…