తెలుగు వెబ్‌ సీరిస్‌లోకి కోవై సరళ!

Kovai Sarala to star in Telugu web series!

లేడీ కమెడియన్‌ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కోవై సరళ. అప్పట్లో ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, కోవై సరళ జోడికి ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఉండేవారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అనేక చిత్రాల్లో నటించి, తనదైన బాషతో డిఫరెంట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ తో దాదాపు రెండు దశాబ్దాల పాటు కోవై సరళ అందరినీ మెప్పించింది. అయితే కారణాలు ఏవైనా ఆమె కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరమైంది. తెలుగు అని కాదు తమిళంలో కూడా అడపాదడపా సినిమాలు చేస్తోంది. అలా తెలుగులో డబ్‌ అయి వచ్చిన సినిమాలను మాత్రమే తెలుగు వాళ్ళు చూసి ఆనందించాల్సి వస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కోవై సరళ ఓ తెలుగు వెబ్‌ సీరిస్‌ లో ఎంట్రీ ఇస్తోందట. యంగ్‌ హీరోయిన్‌ రీతూ వర్మ,…