‘చంద్రముఖి 2’కి కీరవాణి సంగీతం!

Keeravani music for 'Chandramukhi 2'!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది మంది సంగీత దర్శకులలో కీరవాణి మాత్రమే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. తెలుగు సంగీత సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాంటి సినిమాలతో దేశ వ్యాప్తంగానే కాకుండా .. ప్రపంచ వ్యాప్తంగాను మంచి క్రేజ్‌ అందుకున్నారు. ఏకంగా ఆస్కార్‌ వరకు వెళ్లి తెలుగు జాతి గర్వపడేలా చేశారు. ఎలాంటి పాటనైనా సరే తనదైన శైలిలో కంపోజ్‌ చేసి ఆకట్టుకునే కీరవాణి మళ్లీ చాలా బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కీరవాణి ‘చంద్రముఖి 2’ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్‌ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. 2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌ గా తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో కూడా మ్యూజిక్‌ చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఇప్పటికే…