భారతీయ సినిమాకు సేవల విషయంలో ఏఎన్నార్‌తో సరితూగడం ఎవరికైనా కష్టమే అని అమితాబ్ బచ్చన్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సోమవారం నిర్వహించిన ‘ఏఎన్నార్ జాతీయ అవార్డు’ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2024గానూ చిరంజీవికి ఆయన పురస్కారం ప్రదానం చేశారు. అనంతరం అక్కినేని కుటుంబం, చిరంజీవిని కొనియాడారు. ”తెలుగు సినిమానే కాకుండా మొత్తం సినీ ఇండస్ట్రీలో ఏఎన్నార్ సత్తా చాటారు. తన నటనతో ఎంతోమందికి వినోదం పంచారు. ఏఎన్నార్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. నా కుమారులు.. నా కుమారులైనంత మాత్రాన నా వారసులు కాలేరు. ఎవరైతే నా వారసులవుతారో.. వారే నా కుమారులవుతారు అంటూ తన తండ్రి హరివంశ్‌రాయ్ బచ్చన్ రాసిన ఓ కవితను ప్రస్తావిస్తూ.. ఏఎన్నార్ విషయంలో నాగార్జున, ఆయన కుటుంబం దీన్ని నిరూపించిందన్నారు. ఎప్పుడు…