“మన ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (AAA) తొలి జాతీయ సదస్సుకు మీ అందరికీ ఆహ్వానం పలకడం ఎంతో ఆనందంగా ఉంది—మన సాంస్కృతిక సంప్రదాయాలను, వారసత్వాన్ని ఘనంగా జరుపుకునే ఈ వేడుకలో మీరు అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ఏడాది సదస్సు మరుపురాని సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా ఉండబోతోంది. సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు, వీనుల విందైన సంగీత ప్రదర్శనలు, ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకులచే అబ్బురపరిచే సంగీత కచేరీలు అలరించబోతున్నాయి. మన సదస్సుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ తెలుగు చిత్ర నటుడు హాజరై ఈ ప్రత్యేక సందర్భాన్ని మనతో కలిసి పండగలా జరుపుకోబోతున్నారు. మన సంస్కృతికి ప్రతిరూపం రంగవల్లులు. తెలుగు లోగిళ్ళలో పండగ కళ తీసుకొచ్చే ‘ముగ్గుల పోటీ’ని ప్రపంచవ్యాప్త పోటిగా నిర్వహిస్తున్నాం. అలాగే షార్ట్ వీడియోలని ఆకట్టుకునేలా రూపొంచేవారి కోసం ‘రీల్స్ పోటీ’ కూడా ఉంది.…