ఈనెల 19-21 వరకు హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు నిర్వహణ కమిటీ ప్యాట్రన్ , అంకురం సినిమా దర్శకుడు, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్ జ్యూరీ కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర రావు తెలిపారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉమా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ సహాయ సహాకారాలతో దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీస్ ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 19 నుండి 21వ తేదీ వరకు ప్రసాద్ మల్టీ ప్లెక్స్ థియేటర్ లోని స్క్రీన్ నెంబర్. 4 మరియు 5లో ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థ , సాంస్కృతిక, యువజన, పర్యాటక శాఖలు ఈ కార్యక్రమాన్ని…
