పథకం ప్రకారమే మహిళా జర్నలిస్టులపై అసభ్యకర పోస్టులు

Indecent posts against female journalists are planned

-మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన ప్రతినిధి బృందం -కఠినచర్యలు తప్పవు కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా మహిళా జర్నలిస్టులపై సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న బెదిరింపులు, అసభ్యకర పోస్టులు, దుర్భాషలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, వీటిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదా హామీ ఇచ్చారు. మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కే. విరాహత్ అలీతో పాటు మహిళా జర్నలిస్టుల ప్రతినిధి బృందం కమిషన్ చైర్ పర్సన్ ను కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. మహిళా జర్నలిస్టులపై జరుగుతున్న నిరంతర ట్రోలింగ్‌, వేధింపులు, బెదిరింపులు, అసభ్య దాడుల వివరాలను వారు అందించారు. ఈ సందర్బంగా జర్నలిస్టుల ప్రతినిధి బృందం ట్రోలింగ్ స్వరూపాన్ని చూపించే అనేక వీడియోలను చైర్…