స్వీటీ అనుష్క, మాధవన్, మైఖేల్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజ్ వంటి వారు నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. దర్శకుడు హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం చిత్రీకరణ ఎప్పుడో జరుపుకున్నప్పటికీ.. థియేటర్స్‌లోకి వచ్చే టైమ్‌కి కరోనా రూపంలో థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత థియేటర్స్ కోసం కొంతకాలం వెయిట్ చేసినా.. సరైన క్లారిటీ లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా ఈ చిత్రం గాంధీ జయంతి రోజు విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత కాస్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఓవరాల్‌గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వారికి లాభసాటి ప్రాజెక్ట్‌గా నిలిచిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వారు విడుదల చేసే సమయానికి మార్కెట్‌లో సరైన సినిమా లేకపోవడంతో.. అందరూ ఈ…