Happy Birthday : అక్టోబర్‌ 23 : హ్యాపీ బర్త్ డే టు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్

Happy Birthday to pan india star Prabhas

ఒకప్పటి తెలుగు సినిమా అంటే కమర్షియల్ చిత్రాలకి, అడపాదడపా వచ్చే ఫ్యామిలీ చిత్రాలకు మాత్రమే జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండేది. వంద కోట్ల రూపాయల వసూళ్లు కష్టంగా దాటే తెలుగు చిత్రాల పరిస్థితి ని పూర్తిగా మార్చేస్తూ నేటి తెలుగు దర్శకులు, ఈతరం నటులు అంతర్జాతీయ స్థాయిలో కలలు కనే ధైర్యం ఇచ్చింది ఒక చిత్రం. కేరీర్ లో సక్సెస్ తో ఉన్న అతి ముఖ్యమైన అయిదేళ్ళని ఆ చిత్రానికి అంకితం చేసి తెలుగుపరిశ్రమ గుర్తింపుని బాక్సాఫీస్ రూపు రేఖలని మార్చేశారు ఒక హీరో. ఆ హీరో ‘ప్రభాస్’, ఆయన నటించిన ఆ సినిమా బాహుబలి. ఒకప్పుడు కృష్ణుడు, రాముడు అంటే ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు, తెరపై ఆయన ఆహార్యం అలాంటిది. అలా ఆరడుగుల ఎత్తు, గంభీరమైన స్వరం, కండలు తిరిగిన దేహంతో, అమరేంద్ర బాహుబలిలా ప్రభాస్ ఠీవిగా…