ఈమధ్య సినిమాల ప్రచారాలు కొంచెం విచిత్ర ధోరణిలోనే వెళుతున్నాయని చెప్పుకోవచ్చు. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా చిత్ర నిర్వాహకులు కూడా వైవిధ్యంగా ఉండటం కోసమని ఏకంగా స్మశానవాటికలోనే తమ సినిమా టీజర్ లాంచ్ చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ టీజర్ లాంచ్ చేస్తున్నాం అని ఆ చిత్ర పీఆర్ విూడియా వాళ్ళకి మెసేజ్ లు పంపాడు. ఈ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ సినిమా ఇంతకు ముందు విడుదలై ఘన విజయం సాధించిన ‘గీతాంజలి’ కి సీక్వెల్ గా వస్తోంది. ఇందులో అంజలి ప్రధానపాత్రలో నటించింది. శివ తుర్లపాటి దీనికి దర్శకుడు, కోన వెంకట్ కథని సమకూర్చారు, ఈ సినిమా నిర్మాణంలో కూడా భాగం అయ్యారు. ఇంకా ఇందులో శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్,…