ప్రముఖ చలనచిత్ర, టీవి నిర్మాత, రచయిత వి. మహేశ్ (85) శనివారం రాత్రి గుండెపోటుతో చెన్నయ్ లో కన్నుమూశారు. ‘మాతృమూర్తి’ చిత్రంతో 1975 లో వి. మహేశ్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన వి.వి. రాజేంద్ర కుమార్ సోదరుడే మహేశ్. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘మనుష్యులంతా ఒక్కటే’ (1976) చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించడమే కాకుండా దానికి మూలకథను అందించింది వి. మహేశ్. ఆ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’ (1981), చిరంజీవి, కోడి రామకృష్ణ కాంబినేషన్ లో ‘సింహపురి సింహాం (1983), సుమన్, బోయిన సుబ్బారావు కాంబినేషన్ లో ‘ముసుగు దొంగ’ (1985) చిత్రాలను నిర్మించారు. అలానే కిరణ్ జ్యోతి ఆర్ట్స్ బ్యానర్…