నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా తాతగారు నందమూరి…