నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్ కేసరి’ సినిమా అక్టోబర్ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు, అతని షూటింగ్ కూడా అయిపోయింది…