ప్రతాని రామకృష్ణగౌడ్‌, లయన్‌ సాయివెంకట్‌ చేతులు మీదుగా ఘనంగా ‘బారసాల’ లోగో ఆవిష్కరణ

barasala movie logo lauanch

శ్రీ సేవాలాల్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ నిర్మాతగా.. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్‌ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శక, నిర్మాత లయన్‌ సాయి వెంకట్‌లు విచ్చేశారు. ముందుగా ప్రతాని, సాయివెంకట్‌ల చేతుల మీదుగా చిత్ర టైటిల్‌ లోగో ఆవిష్కరణ జరిగింది. అనంతరం చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన రామకృష్ణగౌడ్‌ గారికి, సాయివెంకట్‌ గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మా యూనిట్‌ తరపున ధన్యవాదాలు. అలాగే నాకు దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్‌ గారికి థ్యాంక్స్‌.…