ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ ‘శ్రీరస్తు’- త్వరలో రిలీజ్

'Sreerastu' — a youthful family entertainer from Hari Creations starring Pranam Devaraj, Shankar Reddy, and Hari Krishna Goud — is releasing soon.
'Sreerastu' — a youthful family entertainer from Hari Creations starring Pranam Devaraj, Shankar Reddy, and Hari Krishna Goud — is releasing soon.
Spread the love

ప్రణమ్ దేవరాజ్ హీరోగా, సంజనా ఆనంద్ హీరోయిన్ నటిస్తున్న యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘శ్రీరస్తు’. హరి క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శంకర్ రెడ్డి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు శంకర్ రెడ్డికి, నిర్మాత హరి కృష్ణ గౌడ్ కి ఇది తొలి చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే కామెడీతో ఈ చిత్రం యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అంశాలతో ‘శ్రీరస్తు’ తెరకెక్కుతోంది. హీరో హీరోయిన్ పాత్రల మధ్య ప్రేమకథ సినిమాకు ముఖ్యమైన అంశంగా ఉండనుంది.
ఈ చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
శేఖర్ చంద్ర సంగీతం, బాల సరస్వతి సినిమాటోగ్రఫీ, శ్రీ వర్కల ఎడిటింగ్, కృష్ణ మాయ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘శ్రీరస్తు’ టైటిల్, ఫస్ట్ లుక్ తో సినిమాపై ఆసక్తిని పెంచేలా చిత్రబృందం సిద్ధమవుతోంది.
ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.
‘శ్రీరస్తు’ చిత్రాన్ని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
నటీనటులు: ప్రణమ్ దేవరాజ్, సంజనా ఆనంద్, ప్రజ్వల్ దేవరాజ్, సుమన్, దేవి ప్రసాద్, అమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ
రచన, దర్శకత్వం: శంకర్ రెడ్డి
బ్యానర్: హరి క్రియేషన్స్
నిర్మాత: పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: బాల సరస్వతి
ఎడిటింగ్: శ్రీ వర్కల
ప్రొడక్షన్ డిజైన్ :కృష్ణ మాయ
పీఆర్వో: తేజస్వీ సజ్జా