తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, CPI (ML) జనశక్తి నాయకులు, ప్రజావిమోచన సంపాదకులు కామ్రేడ్ బండ్రు నరసింహులు (104) జనవరి 22,2022న మ. 3 గంటలకు తుది శ్వాస విడిచారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో వారంరోజులుగా హాస్పిటల్ లో చికిత్స పొందిన బండ్రు నరసింహులు స్వస్థతపొంది 21 జనవరి రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆక్సిజన్ సహాయంతో బాగ్ అంబర్పేట్ లోనే తన పెద్ద కుమారుడు బండ్రు ప్రభాకర్ వద్ద చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్ట్ తో తనువు చాలించారు. తన పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు. నిండు నూరేండ్లు బతకమనే పెద్దల దీవేనలన్నీ అపహాస్యమవుతూ రైతాంగపు బలవన్మరణాలు, ఎన్ కౌంటర్ హత్యలు, రాజ్యమేలుతున్న సమయంలో తూటాలు దిగిన శరీరంతో ఏటికి ఎదురీదుతూ నూరెండ్లుగా విప్లవ రాజకీయాలలో కొనసాగడం మామూలు విషయం కాదు. అమరులు వేసిన విప్లవ…