వివిధ భాషల్లోకి బాలయ్య ‘అఖండ’ ప్రయోగం!?

vividha bhasahalloki Akhanda Prayogam!!

మాస్ నాడిని పట్టుకోవడం బహుశా .. దర్శకుడు బోయపాటి శ్రీనుకు తెలిసినంత మరే దర్శకుడికి తెలియదేమో.. అనిపిసిస్తుంది ‘అఖండ’ ప్రభంజనం చూస్తూంటే! నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయనకు జోడీగా బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ ఇతర కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య 2021 డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తాజాగా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ సత్తా చాటుతూనే ఉంది. అయితే.. ఈ ‘అఖండ’ను హిందీతో పాటు మిగతా భాషల్లో డబ్ చేయనున్నట్టు తెలిసింది. బాలయ్యకు సంబంధించి గతంలో ఏ సినిమా కూడా డిస్నీ హాట్ స్టార్‌లో సెట్ చేయని రికార్డు ఓటీటీ వేదికగా ‘అఖండ’ క్రియేట్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి. అంతేకాదు..…