ఆనంద సాయికి పవన్ అభినందనలు

pawan kalyan greetings to anand sai

యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మికరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మికరత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటుడు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్‌లోని బిర్లా ఆడిటోరియమ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి…