టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి మంచి పాపులారిటీ సంపాదించుకున్న అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా ‘తెప్పసముద్రం’ ‘వెడ్డింగ్ డైరీస్’ వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘పరమపద సోపానం’. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది . జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ…