ఆది సాయికుమార్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి అర్చన అయ్యర్ ఫస్ట్ లుక్ విడుదల

Archana Iyer first look released from Aadi Saikumar's supernatural horror thriller 'Shambala'

విమర్శకుల ప్రశంసలు పొందిన కృష్ణమ్మ చిత్రంలో తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు అర్చన అయ్యర్. ప్రస్తుతం అర్చన అయ్యర్ సూపర్‌ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్‌’లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం మేకర్లు ఈ చిత్రంలోని ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఆది సాయికుమార్‌, స్వాసిక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అర్చన అయ్యర్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దేవీ పాత్రలో అర్చన అయ్యర్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అర్చన ఎరుపు చీరలో కనిపిస్తోంది. ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పలికిస్తూ కనిపించింది. బ్యాక్ గ్రౌండ్‌లో పంట, గుడి, పక్షులు, దిష్టిబొమ్మ ఇలా అన్నీ కూడా చాలా క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి. పోస్టర్లతోనే అందరిలోనూ ఆసక్తిని పెంచేస్తోంది…