ఆర్ కె ఫిలిమ్స పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం నవంబర్ 29న గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన “ఝాన్సీ ఐపిఎస్” చిత్రాన్ని తెలుగులో అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాను. లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఈ చిత్రం మా ఆర్ కె బ్యానర్ కు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది లక్మీ రాయ్ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్ లో…