‘అందరూ బాగుండాలి.. అందులో ఆలీ కూడా ఉండాలి’ : ఎస్.వి. కృష్ణారెడ్డి మలయాళంలో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిన ‘వికృతి’ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా రీమేక్ చేసి తెరకెక్కించిన యూత్ ఫుల్ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. అలీ సమర్పణలో అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో అలీబాబ, కొణతాల మోహన్‌కుమార్, శ్రీ చరణ్ ఆర్. లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర ట్రైలర్, టీజర్‌ను ఘనంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన దర్శక, నిర్మాతలు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, స్టార్ కామెడియన్ బ్రాహ్మానందం చేతుల మీదుగా ‘అందరూ బాగుండాలి…