‘ఆహా..’ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి!

andharooBangundali andhulo nenundali

‘‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’’… రాబోతున్న ఈ వింటర్ కాలంలో ఎంటర్టైన్మెంట్ అండ్ మంచి సినిమా లేదు అని బాధ పడేవారికి అహా వారు అందించబోతున్న సినిమా ఇది. గొప్ప కథకు ఆసక్తికరమైన కథనానికి సూపర్ స్టార్స్ అక్కర్లేదు అని నిరూపించబోతున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాక, తెలుగు సినిమాను కూడా ఇంత సహజంగా తీస్తారా అనిపిస్తుంది. రక్తమాంసాలు ఉన్న పాత్రల తాలూకు గొప్ప జర్నీని సినిమాలో చూపించిన విధానం అద్భుతమైనది. ఇలాంటి సినిమాని ఏ తల పండిన నిర్మాతనో తీయలేదు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ను నెలకొల్పి అలీ ఈ మంచి చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. పైగా ఈ కథలో నరేష్ – పవిత్రా లోకేష్ జంటగా కనిపించబోతున్నారు. ఇద్దరి మధ్య మరోసారి…