బాలీవుడ్ బ్యూటీ ‘‘ అనన్య పాండే ‘‘ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈమె.. తెలుగులో కూడా ఒక సినిమాలో నటించింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాతో పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో తెలుగులో మళ్లీ మరో సినిమాకు ఓకే చెప్పలేదు. రీసెంట్ గానే లైగర్ సినిమాను అనన్య అయిష్టంగానే ఒప్పుకుందని చుంకీ పాండే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా…
