అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ప్రారంభం :ఘనంగా సూపర్ స్టార్ కృష్ణకు సన్మానం

Alluri seetharamarju jayanthi

హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జూలై 4, 2022 ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరపబోయే శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి జాతీయ వేడుకల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, తెలంగాణ, ఏపీ మంత్రులు, శ్రీనివాస్‌ గౌడ్, అవంతి శ్రీనివాస్, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు, కృష్ణ సోదరుడు-నిర్మాత ఆదిశేషగిరి రావు, సినీనటుడు మోహన్‌ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.…