అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తూ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తండేల్. వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిందనే విషయం అందరికి తెలిసిందే. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ చిత్రం రూపుదిద్దుకోవడానికి గల మూల కారణం ఒక అల్లు అర్జున్ ఫ్యాన్. నిజానికి పాకిస్తాన్ లో చిక్కుకుని కరాచీ జైలులో ఉన్న సమయంలో మన దేశ జాలరులకు ఆ జైలులోని ఒక కానిస్టేబుల్ వారికి సాయం చేయడం జరిగింది. అతడు అల్లు అర్జున్ ఫ్యాన్. ఈ జాలరులు పాకిస్తాన్ జైలులో ఉన్న సమయంలో వారికి ఎంతో సాయపడుతూ వచ్చాడు ఆ కానిస్టేబుల్. అయితే ఆ జాలరులు విడుదలవుతున్న సమయంలో ఆ కానిస్టేబుల్ వీరి నుండి ఒక ఫేవర్…