దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఘనంగా జరుపుకుంటోంది. సినీ లోకం ఆ మహానటుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అక్కినేని కేవలం తెలుగు సినిమాకే కాదు భారతీయ సినియా దిగ్గజాల్లో ఒకరు. దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలిన ఇద్దరు అగ్రనటులలో ఒకరు నందమూరి తారకరామారావు ..ఇంకొకరు అక్కినేని. సెప్టెంబర్ 20 అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి. నటుడిగా ఆయన గురించి చెప్పాలంటే …పౌరాణికాల్లో ఎన్టీ రామారావు… సాంఘికాల్లో నాగేశ్వరరావు. మన తొలి తరం తెలుగు నటులందరూ మొదట నాటకాల్లో నటించినవారే. అంటే, గొంతెత్తి డైలాగులు చెప్పినవారే. చేతులను విపరీతంగా కదిలిస్తూ అభినయించినవారే. అంటే, ఆంగికం, వాచికం రెండూ గట్టిగా చేసేవారు. అక్కినేని కూడా ఆ సంప్రదాయం నుంచి వచ్చిన నటుడే. అందులోనూ ఆడవేషాలు వేసిన అనుభవంతో చలనచిత్రాల్లో నాయకుడైన అపురూపమైన జీవితం…