అఖిల్ అక్కినేని 5వ సినిమా వివరాలివే

Akhil Akkineni 5th Film

ఎదురుచూస్తున్న బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. చిరంజీవి సైరా నరసింహా రెడ్డితో బ్లాక్ బస్టర్ కొట్టిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ సినిమా రూపొందనుంది. వక్కంతం వంశీ అందించిన పవర్ ఫుల్ స్టొరీతో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుంది. అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సరెండర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. యంగ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. ‘‘ఇట్స్ టైమ్‌! సురేంద‌ర్ రెడ్డి, అనీల్‌సుంక‌రగారితో నా సినిమా అనౌన్స్ చేయ‌డం హ్యాపీగా ఉంది. ఇది నాకు ఎక్స్‌ట్రీమ్‌లి స్పెష‌ల్ మూవీ. పూర్తి ఉత్సాహంతో…