వసూళ్లలో ‘జైలర్‌’ దూకుడు.. సునీల్‌ కామెడీపై ప్రేక్షకుల అసహనం!

Aggressiveness of 'Jailer' in collections.. Audience's impatience with Sunil's comedy!

డ్రగ్స్‌, స్మగ్లింగ్‌, పిల్లల అక్రమ రవాణ, టెర్రరిజం.. వంటి సీరియస్‌ కథలకు డార్క్‌ కామెడీ జోడించి భిన్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌. కెరీర్‌ ఆరంభంలోనే స్టార్‌ యాక్టర్స్‌ తో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా సూపర్‌ స్టార్‌ జైలర్‌ చిత్రంతో భారీ గ్రాండ్‌ హిట్‌ ను అందుకున్నారు. ఈ చిత్రం కోలీవుడ్‌ తో పాడు వరల్డ్‌ వైడ్‌ గా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తెలుగులోనూ చిరు ‘భోళాశంకర్‌’ డిజాస్టర్‌ అవ్వడం వల్ల మరిన్ని వసూళ్లను అందుకుంటూ దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రంలో టాప్‌ కమెడియన్‌ అండ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ సునీల్‌ ఓ పాత్ర పోషించిన సంగతి తెలిసింది. ఆయన పాత్రను తీర్చిదిద్దిన తీరు ఓ వర్గం తెలుగు ఆడియెన్స్‌ కు నచ్చలేదని తెలుస్తోంది. దర్శకుడు నెల్సన్‌ కుమార్‌ పై కాస్త ఆగ్రహానికి…