ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ముచ్చట! నేను అప్పుడు ప్రభుత్వ సాంస్కృతిక మండలిలో PRO/OSD గా పని చేస్తున్న రోజులు! సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గా అవధాని డా. రాళ్లబండి కవితా ప్రసాద్, సలహాదారులుగా డా. కె.వి.రమణాచారి, చైర్మన్ గా నిర్మాత ఆర్.వి.రమణమూర్తి వున్న కాలం! ఇప్పటిలా అప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వమే! ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ గా హృదయంతో మాట్లాడే ఎన్.రఘువీరా రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రిగా వట్టి వసంత్ కుమార్ వైభవం నడుస్తున్న రోజులవి! నాకు బాగా గుర్తు… 2013 మే 12వ తేదీ! రాళ్లబండి కవితా ప్రసాద్ పిలిచి “19వ తేదీ రవీంద్రభారతిలో అత్యంత వైభవంగా పూర్వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి నిర్వహిస్తున్నాం, ఏం చేస్తే బావుంటుంది” అనడిగారు! పది నిముషాల ఎవి చేద్దాం…