యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాధిక, ఊర్వశి, కుష్బు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా నటి ఊర్వశి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు.. -ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిలే చాలా పాజిటీవ్‌గా ఉంది. టైటిల్ చూడగానే ఆడవారికి ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్ధం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఫ్రేములో ఐదుగురు మహిళలకి సమానమైన ప్రాధాన్యత కలిగించడమే గొప్ప విషయం. ఎక్కడా కూడా…