ఫిబ్రవరి 23న ప్రపంచవ్యాప్తంగా చిత్రం విడుదల ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెబుతా, సేవ్ టైగర్ చిత్రాల్లో కమెడియన్‌గా పాపులారిటీ సంపాందించుకుని, తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు అభినవ్ గోమఠం. అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అతని పాపులర్ డైలాగ్ అయిన మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా టైటిల్‌తోనే అభినవ్ హీరోగా ఓ చిత్రం రూపొందుతుంది. వైశాలి రాజ్ హీరోయిన్. కాసుల క్రియేటివ్ వర్క్స్ పతాకపంపై తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తో పాటు చిత్ర విడుదల తేదిని సోమవారం ప్రకటించారు మేకర్స్. ఫిబ్రవరి 23న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ హాస్యనటుడిగా, సహాయ నటుడిగా అందరి ప్రశంసలు అందుకున్న…