వైభవంగా ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం

A grand program of Icons of Indian Film Industry Awards 2024

తెలుగు సినిమా అభివృద్ధికి పాటుపడిన ఎంతోమంది గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలను సత్కరించేందుకు ఏర్పాటు చేసిన ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డ్స్ 2024 కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. “తెలుగు ఫిల్మ్ అండ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరమ్ చైర్మన్ నాగబాల సురేష్ ఆధ్వర్యంలో ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమానికి విజన్ వివికె హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్” సంస్థ అధినేత వి.వి.విజయ్ కుమార్ స్పాన్సర్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మురళీ మోహన్, రోజా రమణి, వీకే నరేష్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్రబోస్, రాజ్ కందుకూరి, ప్రవాసాంధ్ర ప్రముఖులు టాక్ షో ప్రయోక్త కిరణ్ ప్రభ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్, జర్నలిస్ట్ ప్రభు తదితరులు…