అలీ, నరేశ్‌లు ముఖ్యపాత్రల్లో నటించి ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించి మెప్పించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. మౌర్యాని, పవిత్రా లోకేశ్ కీలకపాత్రల్లో నటించారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా వల్ల రోజుకో రకంగా ఎవరో ఒకరు ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియానే తమ కథా వస్తువుగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’’. 40రోజుల క్రితం ఆహా ఓటీటీ చానల్‌లో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ విడుదలైంది ఈ సినిమా. విడుదలైన రోజు నుండి ఈ రోజు వరకు రకరకాల కాంప్లిమెంట్స్ వచ్చాయి. సినిమాలో నటించిన నటీ నటులందరికి మెసేజ్‌ల రూపంలో ఇప్పటికి రోజు మెసేజ్‌లు అందుతున్నాయి అన్నారు అలీ అండ్ టీమ్. ఆలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అలీ సమర్పణలో మోహన్ కొణతాల, అలీబాబా, శ్రీచరణ్ నిర్మించిన ఈ చిత్రానికి…