ఈ నెల 24న ప్రేక్షకాభిమానులకు పండగే పండగ. ఒకటి కాదు రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు అదే రోజున రీ రిలీజ్ కానున్నాయి . మాస్ మహారాజా రవితేజ, అందాల భామలు రిచా గంగోపాధ్యాయ, దీక్షాసేథ్ హీరోహీరోయిన్లుగా నటించిన “మిరపకాయ్” సినిమా ఒకప్పుడు ఎంతగా అలరించిందో తెలిసిందే. మాస్ పల్స్ తెలిసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన ఈ సినిమా యాక్షన్, కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన రవితేజకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. నాగబాబు, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, సునీల్, అజయ్ తదితర ఆర్టిస్టులు తమ తమ పాత్రలలో జీవించారు. తమన్ సంగీతం వీనులవిందు చేస్తుంది. ఇలాంటి చక్కటి దృశ్యరూపం 24వ తేదీ సందడి చేయబోతోంది. ఈ కోవలోనే ప్రేక్షకులను ఓలలాడించిన మరో బ్లాక్ బస్టర్ “అలా మొదలైంది” సినిమా కూడా 24న…