వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి నిర్మిస్తున్న మరో చిత్రం “బుట్ట బొమ్మ”. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు నాయిక, నాయకులుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగవంశీ ఎస్. – సాయి సౌజన్య నిర్మాతలు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం అవుతున్నారు. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న “బుట్ట బొమ్మ” విడుదల తేదీ ప్రచార చిత్రం ను ఈ రోజు అధికారికంగా సామాజిక మాధ్యమం వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. విడుదలైన ప్రచార చిత్రం ను పరికిస్తే… ఆకట్టుకోవడంతో పాటు, ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్…