‘హిడింబ’ రివర్స్ ట్రైలర్ విడుదల

'హిడింబ' రివర్స్ ట్రైలర్ విడుదల

యంగ్, ప్రామిసింగ్ హీరో అశ్విన్ బాబు హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ హిడింబ థియేట్రికల్ రిలీజ్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ (SVK సినిమాస్), ఓఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హిడింబ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిడింబ థియేట్రికల్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ సెటప్, గ్రాండ్ మేకింగ్, అత్యున్నత సాంకేతికత ప్రమాణాతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ రోజు మేకర్స్ రివర్స్ ట్రైలర్‌ విడుదల చేశారు. ప్రతి సీక్వెన్స్‌ను రివర్స్ ఆర్డర్‌లో ప్రజంట్ చేసిన ఈ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా వుంది. టాలీవుడ్‌లో రివర్స్ ట్రైలర్ విడుదల చేయడం ఇదే తొలిసారి. రెండు వేర్వేరు టైమ్ లైన్స్ లో కథ అద్భుతంగా చూపించారు. యూనిక్ థాట్ తో సరికొత్తగా…