ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్'(వాతి). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సముద్రఖని, సాయి కుమార్, తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో హ్యాండ్సమ్ హీరో సుమంత్ అతిథి పాత్రలో కనువిందు చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న భారీస్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ రెండు భాషల్లోనూ సంచలన విజయం దిశగా దూసుకుపోతోంది. సార్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటంతో తాజాగా చిత్ర బృందం…