‘వరల్డ్ ఆఫ్ శబరి’ – వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమా గ్లింప్స్ విడుదల

'వరల్డ్ ఆఫ్ శబరి' - వరలక్ష్మీ శరత్ కుమార్ పాన్ ఇండియా సినిమా గ్లింప్స్ విడుదల

విలక్షణ పాత్రల్లో కనిపిస్తూ… పాత్రకు తగ్గట్టుగా స్టైల్, యాక్టింగ్ మారుస్తున్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాపెనింగ్ లేడీగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. ‘వరల్డ్ ఆఫ్ శబరి’ పేరుతో ఈ రోజు వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. సినిమాలో మెయిన్ క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు సుమారు నిమిషం నిడివి కల వీడియోలో ‘శబరి’ థీమ్, మూడ్ ఎలా ఉంటుందనేది చూపించారు. ప్రకృతికి చిరుమానా లాంటి ఓ హిల్ స్టేషన్‌లో ఓ మహిళ. తన చిన్నారి కుమార్తెతో జీవిస్తుంటుంది. ‘మమ్మీ…’…